ములుగు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి సీతక్క
ములుగు నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పలు గ్రామాలను శుక్రవారం నాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మోకాలపల్లి గ్రామంలోని పెద్దమ్మతల్లి బోనాల సందర్భంగా శివసత్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాదిరెడ్డిపల్లి లో గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎచగూడెం, ఓటాయి, రాంపూర్, కోనాపురంగ్రామాలో పర్యటించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల గురించి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు అనేక గ్రామాలు నీట మునిగాయి. మళ్లీ అలాంటి సంఘటనలు పునరవృతం కాకుండ చూసుకోవాలని కోరారు. వర్షాలకు, వరదలకు ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. స్థానికం నాయకులు ఏర్పటు చేసిన ప్రైవేట్ కార్యక్రమంలో హాజరు అయ్యారు. అదే విధంగా పలువురు రైతులు వ్యవసాయానికి పాకాల చెరువు నుండి రెండు పంటలకు నీళు అందించాలని వినతిప్రతం అందజేశారు.
Share this article in your network!