రౌడి హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఇవాళ అధికారికంగా లాంచ్ అయింది. సినిమా లాంచ్‌కి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. 

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ కొట్టారు. హరీశ్ శంకర్‌తో పాటు దర్శకులు కొరటాల శివ, బాబీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ పూర్తిగా డీసెంట్ లుక్‌లో కనిపించాడు. విజయ్ - సమంత కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషం అబ్దుల్ హవద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా లాంచ్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.