సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను పలు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు పరామర్శించారు. 

నారాయణ భార్య వసుమతిదేవి మృతికి తమ సంతాపం వ్యక్తం చేసి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి రోజా. నారాయణ ఇంటికి వెళ్లి.. వసుమతిదేవి చిత్రప‌టం వ‌ద్ద మంత్రి పుష్పాంజ‌లి ఘ‌టించి ఆమెకు నివాళుల‌ర్పించారు. అనంత‌రం.. నారాయణ కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి ఆర్కే రోజా త‌న ప్రగాఢ సానుభూతిని తెలిపారు.