తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగన్వాడీల బలోపేతం పై మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టి సారించింది. చిన్నారుల్లో పోషకాహరాన్ని మెరుగు పరిచేందుకు మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్చంద సంస్థల సహకారాన్నితీసుకోవాలని నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాపై రాష్ట్ర సచివాలయంలో ఆ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా అంగన్వాడి కేంద్రాల బలోపేతం, పోషకార మిషన్, ఉద్యోగ ఖాళీల భర్తీ, కారుణ్య నియమకాలు, అంగన్వాడి సేవల్లో మహిళా స్వయం సహయక బృందాలు, స్వచ్చంద సంస్థలకు భాగస్వామ్యం, చిన్నారుల పోషకాహార మెరుగుదల కోసం అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీలను బలోపేతం చేసే దిశలో పలు కీలక సూచనలు చేశారు. శిధిలావస్తలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తక్షణం సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. వీలనైంత త్వరగా అంగన్వాడీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు మోబైల్అంగన్వాడీ , కంటేనర్ అంగన్వాడీలను ఏర్పాటు చేయాలని సూచించారు. వీటికి సంబంధించి వెంటనే నిపుణులతో చర్చించి డిజైన్ ను సిద్దం చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతం కోసం ముందుకు వచ్చే స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకునేందుకు అన్ లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తేవాలని సూచించారు.
ఇక అంగన్వాడీ చిన్నారుల్లో పోషకాహర లోపాన్ని తగ్గించే విధంగా కార్యచరణ సిద్దం చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారి చేశారు. చిన్నారుల్లో పోషకాహర మెరుగుదల పరిశీలించేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పారదోలేందుకు…వారికి అందించే ఆహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా వంద రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సుప్రీం కోర్టు కేసు నేపథ్యంలో అంగన్వాడీల్లో ఖాళీల భర్తి, కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే బాలామృతంలో పలు మార్పులు చేశారు. నిపుణుల సిఫార్సు మేరకు పంచదార లేకుండా సరికొత్త బాలమృతం ను టీజీ ఫుడ్స్ సిద్దం చేయగా మంత్రి సీతక్క రుచి చూసి పలు సూచనలు చేశారు. పిల్లలకు తిపి అనుభూతి కలిగించేలా కర్జూరా పౌడర్ ను మిక్స్ చేయాలని సూచించారు. త్వరలో సరికొత్త బాలామృతంను పంపిణి చేస్తామన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో అల్పాహారం కోసం కిచిడీ మిక్స్, ఉప్మా మిక్స్ లకు సిద్దం చేశారు. వేడి నీటిలో వేసి మరిగించగానే అల్పాహరం సిద్దమవుతోంది. కిచిడీ మిక్స్, ఉప్మా మిక్స్ లను టేస్ట్ చేసిన మంత్రి అందులో మార్పులు చేర్పులు సూచించారు మంత్రి సీతక్క. ఈ సమీక్ష సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సృజన, తెలంగాణ ఫుడ్స్ ఎం. డి. కే. చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
మహిళా సంఘాలకు ఆర్డీసీ ద్వారా రూ. కోటి ఆదాయం
అర్టీసీ అద్దె బస్సుల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు రూ. కోటి అర్జించాయి. ఇప్పటి వరకు 150 బస్సులను అర్టీసీకి మహిళా సంఘాలు అద్దె ప్రాతిపదికన అప్పగించాయి. ఒక్కో బస్సుకు ఆర్టీసీ నెలకు రూ.70 వేలు చెల్లిస్తోంది. అంటే ఒక్కో నెలకు మహిళ సంఘాలు రూ. కోటి అందుకోనున్నాయి. దీనికి సంబంధించి మొదటి నెల పేమెంట్ ను ఆర్టీసీ మహిళా సంఘాలకు చెల్లించింది. దీనికి సంబంధించిన చెక్కును ఆర్టీసీ యాజమాన్యం నుంచి సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో బేటీ అయిన దివ్యా దేవరాజన్, సెర్ప్ సిబ్బంది మంత్రి సీతక్కకు మిఠాయిలు తినిపించి తమ సంతోషయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సెర్ప్ సీఈఓ ను, సిబ్బందిని, మహిళా సంఘాలను అభినందించారు. ఆర్టీసీ లో మహిళా సంఘాల చే అద్బె బస్సులకు అవకాశం కల్పించి నెలకు రూ. కోటి ఆదాయాన్ని అర్జించేలా సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా భవనలో ఈ నెల 5న ప్రజా భవన్ లో జరిగే ఆర్టీసీ బస్సు ఓనర్లుగా ఉన్న మహిళా సంఘాలకు చెక్కుల పంపిణి కార్యక్రమానికి హజరు కావాలని ఆహ్వనించారు.




