Friday, March 6, 2026
spot_imgspot_img

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 68వ రోజు ప్రజాదర్బార్

Must read

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి తమ సమస్యలు, అర్జీలను మంత్రికి అందజేశారు. ప్రతిఒక్కరితో ఆప్యాయంగా ముచ్చటించిన మంత్రి, వారి వినతులను శ్రద్ధగా విని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజలతో కలిసి ఫోటోలు దిగారు.

వాడబలిజ మత్స్యకారుల సమస్యలు

ఉత్తరాంధ్ర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘ ప్రతినిధులు మంత్రిని కలసి, తమ ఆర్థిక సమస్యలను వివరించారు. బోట్లు, వలలు అందించడం తో పాటు తమ ప్రాంతాల్లో పాఠశాలలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన యువకుడు విజ్ఞప్తి

విశాఖ మిండి ప్రాంతానికి చెందిన దాడి అవినాష్ రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన తనకు ఉద్యోగం కల్పించి, నివాస స్థలం మంజూరు చేయాలని మంత్రిని అభ్యర్థించాడు. తల్లిదండ్రులు లేని తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. దీనిపై మంత్రి సహానుభూతి వ్యక్తం చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వినాయక నవరాత్రుల ఊరేగింపులో సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి కోరుతూ విజ్ఞప్తి

ఉత్తరాంధ్ర ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినాయక నవరాత్రుల ఊరేగింపులో సౌండ్ సిస్టమ్స్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కుటుంబాలు ఉత్సవాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. మంత్రి దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన కుటుంబం ఆవేదన

అనకాపల్లి జిల్లా యలమంచిలి చెందిన గుడాల జీవన్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తన కుమారుడిని కోల్పోయినట్లు, తాను మరియు తన భార్య తీవ్రంగా గాయపడ్డారని తెలిపాడు. కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని మంత్రిని అభ్యర్థించాడు. మంత్రి భరోసా ఇచ్చారు.

దివ్యాంగ కుమార్తెకు ఉద్యోగం కోరిన తండ్రి

విశాఖ 91వ వార్డుకు చెందిన పి. ఆదినారాయణ, డిగ్రీ పూర్తి చేసిన తన దివ్యాంగ కుమార్తెకు ఉద్యోగం కల్పించాలని కోరాడు. మంత్రి దీనిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఇల్లు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తొలగింపుపై విజ్ఞప్తి

విశాఖ భీమిలి మండలం లక్ష్మీపురానికి చెందిన కె. సత్తిబాబు తన స్థలంలో ఇల్లు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలోకి మార్చాలని మంత్రిని కోరాడు. ఈ విజ్ఞప్తిని మంత్రి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!