Friday, March 6, 2026
spot_imgspot_img

పోషకాహార తెలంగాణ కోసం సమష్టిగా కృషి చేద్దాం – మంత్రి సీతక్క

Must read

తెలంగాణలో పోషకాహార తెలంగాణ నిర్మాణంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైద్య నిపుణులు, మేధావులు, డాక్టర్లు, ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “సీఎం రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో భాగస్వామ్య పక్షాలతో సమావేశమయ్యాం. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో చిన్నారులు కీలక భూమిక పోషించనున్నారని” తెలిపారు.

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా,

ప్రతి లబ్ధిదారుడికి రోజూ 200 మిల్లీలీటర్ల విజయ పాలు కిశోర బాలికలకు పల్లి, తృణధాన్యాలతో కూడిన ప్యాకెట్ల పంపిణీ అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యానీ ప్రతి లబ్ధిదారుడికి ఉడకబెట్టిన కోడిగుడ్ల పంపిణీ వంటి పోషకాహార కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

“పిల్లలు పోషకాహార లోపంతో బాధపడకుండా ఉండేందుకు తల్లిదండ్రుల్లో అవగాహన పెంపు కూడా కీలకం” అని పేర్కొన్న మంత్రి, అంగన్వాడీలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచేలా పలు కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.

“అంగన్వాడీ కేంద్రాలు అమ్మ తర్వాత అంతటి సేవలను అందిస్తున్నాయి. పిల్లలు అమ్మ ఒడి నుంచి అంగన్వాడీ బడుల్లోకి రాగలుగేలా చర్యలు తీసుకుంటున్నాం. అంగన్వాడీల్లో ఆహారంతో పాటు అక్షర జ్ఞానం, ఆరోగ్యం కూడా లభిస్తుందన్న విషయం పేరెంట్స్‌కి తెలియజేయాలి” అని ఆమె స్పష్టం చేశారు.

అంగన్వాడీ సేవల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అవసరం అని పేర్కొన్న మంత్రి, వీటి సేవలు హైదరాబాద్‌కు పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకూ విస్తరించాలన్నారు. ఆసక్తి ఉన్న సంస్థలకు అంగన్వాడీ కేంద్రాల దత్తత అవకాశం కల్పిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రి సీతక్క, ‘పోషన్ వాటిక’ కింద నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన ఆరు రకాల కూరగాయల విత్తనాలతో కూడిన సీడ్స్ కిట్‌ను ఆవిష్కరించారు. మొదటి విడతలో 4,500 అంగన్వాడీ కేంద్రాలకు వీటిని పంపిణీ చేస్తామని వెల్లడించారు.

వాటిలో పాలకూర, తోటకూర, మెంతికూర, టమాట, వంకాయ, బెండకాయ విత్తనాలున్నాయని, వీటిని ప్రతిరోజూ వండే ఆహారంలో ఉపయోగించేందుకు స్థానికంగా పెంచేలా చర్యలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, సీఎఫ్టీఆర్‌ఐ (మైసూర్), ఎయిమ్స్, ఇక్రిసాట్, యూనిసెఫ్, ప్రథం, ఆంధ్ర మహిళా సభ, హర్మన్, బాల రక్షభారతి వంటి సంస్థల ప్రతినిధులతో మంత్రి సీతక్క చర్చలు జరిపారు.

వారి అభిప్రాయాలను క్రోడీకరించి “పోషకాహార తెలంగాణ” డాక్యుమెంట్ రూపకల్పన చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!