Friday, March 6, 2026
spot_imgspot_img

డ్రోన్ సేవలు ఇక సామాన్యుడికీ అందుబాటులోకి

Must read

ఆధునిక సాంకేతికతను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్ సేవలను అందించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ను రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, ఐటీ కార్యదర్శి కాటన్నేని భాస్కర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.వ్యక్తిగతులకూ, రైతులకూ, సంస్థలకూ ఉపయోగపడే విధంగా.ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విపత్తు నిర్వహణ వంటి అనేక రంగాలలో డ్రోన్ సేవలు పొందవచ్చు. దీనివల్ల పంటల పైటిశీల ద్రావకాల స్ప్రేయింగ్, పంటల పర్యవేక్షణ, భూమి సర్వేలు, ప్రాజెక్ట్ మానిటరింగ్, భద్రతా పర్యవేక్షణ, మ్యాపింగ్ వంటి సేవలు ప్రజలకూ, రైతులకూ, ప్రభుత్వ శాఖలకూ అందుబాటులోకి వస్తాయి.రేట్లు నేరుగా చర్చించుకునే వెసులుబాటు.
ప్రతి జిల్లాలోనూ డ్రోన్ సేవలందుబాటు కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ఈ పోర్టల్ ద్వారా సర్టిఫైడ్ డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్లతో నేరుగా ప్రజలు సంప్రదించి అవసరమైన సేవలను కోరుకోవచ్చు. ధరలు కూడా నేరుగా చర్చించుకునే అవకాశం కల్పించడం ద్వారా వినియోగదారుల నిబద్ధతను పెంచే విధంగా రూపొందించారు.ప్రజలందరికీ డ్రోన్ సాంకేతికత అందుబాటులోకి రావాలి.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “డ్రోన్ సేవలు ఇప్పుడు కొన్ని ప్రత్యేక సంస్థలకే పరిమితమై ఉండకూడదు. రైతులు, యువత, చిన్న సంస్థలు కూడా ఈ టెక్నాలజీని వినియోగించుకోవాలి. అందుకోసమే ఈ పోర్టల్ అభివృద్ధి చేశాం” అని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రంగాలకు విస్తరించేలా ఈ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.వికాసానికి డ్రోన్ సేవలే ఓ కీలక ఆయుధం.డ్రోన్ టెక్నాలజీని ప్రజలకి అందుబాటులోకి తేవడం ద్వారా అన్ని రంగాలలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారు. ఇది ప్రాజెక్టుల పర్యవేక్షణకు, వ్యవసాయ పరిరక్షణకు, విపత్తు సమయంలో వేగంగా స్పందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!