మిర్యాలగూడకు చెందిన ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు దైద రవి, గురువారం నాడు భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. ఈ కార్యక్రమం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. పార్టీలో చేరిన ఆయనకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు మాట్లాడుతూ,‘‘బీజేపీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా స్వాగతం. ఇంకా ఎంతో మంది ప్రముఖులు, సామాజిక సేవకులు త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని రక్షించాలంటే బీజేపీకి బలమివ్వాలి. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. మిర్యాలగూడను బీజేపీ కంచుకోటగా మార్చాలి. అక్కడ పార్టీ జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలి’’ అని పిలుపునిచ్చారు.




