Friday, March 6, 2026
spot_imgspot_img

అభివృద్ధితో రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా మలుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

Must read

రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతికి శక్తివంతమైన బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాజాగా నిర్వహించిన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ లు హాజరయ్యారు. సీఎస్ కె. విజయానంద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు చెందిన మొత్తం రూ.39,473 కోట్ల విలువైన పెట్టుబడులను SIPB ఆమోదించింది. ఇవి పూర్తయితే 30,899 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంది. మొత్తం 22 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పరిశ్రమలు-వాణిజ్య రంగానికి 11, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగానికి 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున ఉన్నాయి.

ఎకో సిస్టమ్‌తో సమగ్ర అభివృద్ధి లక్ష్యం

పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారు. ఎకో సిస్టమ్‌తో ప్రాజెక్టుల వృద్ధితో పాటు స్థానికులకు, అనుబంధ వ్యాపారాలకు, సేవల రంగానికి లబ్ధి కలగనుంది. భూములు ఇచ్చిన రైతులకు ప్రయోజనం కలిగించేందుకు, సమీప ప్రాంతాల్లో రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, బిజినెస్ హబ్‌లు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

పర్యాటక ప్రాజెక్టులకు పీపీపీ విధానం

పర్యాటక ప్రాజెక్టులకు సమీకృత ప్రణాళికలతో ముందుకెళ్లాలని సీఎం సూచించారు. శ్రీశైలం ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, అక్కడ దేవాలయాలతో పాటు నీటి ప్రాజెక్టు, రహదారి విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హోటల్ ప్రాజెక్టులతో పాటు వినోదం, సేవల రంగానికి సంబంధించి అనుబంధ కార్యకలాపాలు కూడా ప్రోత్సహించాలన్నారు.

ఎంప్లాయిమెంట్ పోర్టల్ సిద్ధం చేయాలన్న సీఎం

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఏర్పడే ఉద్యోగ వివరాలు అందరికీ స్పష్టంగా తెలుస్తుందిలా ఓ ఎంప్లాయిమెంట్ పోర్టల్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.


ఆమోదం పొందిన 22 ప్రధాన ప్రాజెక్టులు

ప్రాజెక్టు పేరుజిల్లాపెట్టుబడి (రూ. కోట్లు)ఉద్యోగాలు
ఫినామ్ పీపుల్ ప్రైవేటు లిమిటెడ్విశాఖపట్నం2052500
శ్రీజా మహిళా ప్రొడ్యూసర్ కంపెనీచిత్తూరు2821400
రెన్యూ వ్యోమన్ పవర్ లిమిటెడ్కర్నూలు, నంద్యాల1800380
రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్కర్నూలు, నంద్యాల3600760
జెఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీకడప20001380
పీవీఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్శ్రీకాకుళం2041000
పీవీఎస్ గ్రూప్విజయనగరం102500
ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్నంద్యాల47081200
ఐటీసీ హోటల్స్ లిమిటెడ్విశాఖపట్నం3281100
లాన్సమ్ లీజర్స్ లిమిటెడ్విశాఖపట్నం86720
స్టార్ టర్న్ హోటల్స్ ఎల్ఎల్ పీతిరుపతి165280
గ్రీన్ ల్యామ్ లిమిటెడ్నాయుడుపేట (తిరుపతి)11471475
యాక్సెలెంట్ ఫార్మాశ్రీసిటీ (తిరుపతి)13581770
అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కర్నూలు69332138
జెఎస్‌డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్కడప45002500
రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్అనకాపల్లి37001200
లారస్ ల్యాబ్స్రాంబిల్లి (అనకాపల్లి)56306350
లులూ షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్విశాఖ, విజయవాడ12221500
ఏస్ ఇంటర్నేషనల్ (డైరీ యూనిట్)కుప్పం (చిత్తూరు)10002000
బ్రాండిక్స్ ఇండియా అపారెల్ సిటీఅచ్యుతాపురంఫుట్‌వేర్, టాయ్స్ యూనిట్లు
వీఎస్ఆర్ సర్కాన్శ్రీకాకుళం39246
అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయెల్స్మల్లవల్లి (కృష్ణా)500500

మొత్తం SIPBలోనూ భారీ ప్రగతి

ఇప్పటివరకు జరిగిన SIPB సమావేశాల్లో మొత్తం 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటివల్ల రూ.5.74 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 5 లక్షల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే కాక, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రణాళికలు రచిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం, ఆర్థికంగా బలమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు కృషి చేస్తోంది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!