కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల కోసం అపర భగీరథుడిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు “సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వైఖరిని గట్టిగా తప్పుబట్టారు.
కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి ఉప్పల్లో బీఆర్ఎస్ ధర్నా




