ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు పరమపదించడంతో సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు కలిసి కోట నివాసానికి చేరుకుని ఆయనకు ఘన నివాళులు సమర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.”కోట శ్రీనివాసరావు కళారంగానికే కాకుండా రాజకీయ రంగానికీ ఎంతో విలువైన సేవలు అందించారు. ఆయన మృతి తీవ్ర నష్టంగా భావిస్తున్నాం,” అని ఈ సందర్భంగా నేతలు వ్యాఖ్యానించారు.కోట శ్రీనివాసరావు మరణం సినీ, రాజకీయ రంగాలకే కాదు, తెలుగు ప్రజలందరికీ తీరనిలోటు. ఆయన సేవలు, కళాప్రతిభ చిరకాలం గుర్తుండిపోతాయని బీజేపీ నేతలు అన్నారు.
కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి బీజేపీ నేతల నివాళి




