Saturday, March 7, 2026
spot_imgspot_img

అరీట్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మార్చి 9 నుండి 16 వరకు ఉచిత మూత్రపిండ ఆరోగ్య పరీక్షలు

Must read

‘ప్రపంచ కిడ్నీ దినోత్సవం’ (వరల్డ్ కిడ్నీ డే) పురస్కరించుకుంటూ, గచ్చిబౌలిలోని అరీట్ హాస్పిటల్స్(Arete Hospitals) రెండో విడత ఉచిత మూత్రపిండఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
మూత్రపిండవ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ శిబిరంలో భాగంగా విచ్చేసిన వారికి ఉచితంగాక్రియేటినిన్ పరీక్ష (Creatinine Test), రక్తపోటు పరీక్ష (BP) తో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్టులతో వైద్య సంప్రదింపులు కూడా అందించబడతాయి.
గతేడాది కూడా ఆసుపత్రి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించగా, సుమారు 750కి పైగా కుటుంబాలు ఈ ఉచిత సేవలను వినియోగించుకున్నాయి.
ఈ ఉచిత వైద్య శిబిరం అందరికి అందుబాటులో ఉంచేందుకు ఎటువంటి ముందస్తు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలందరూ నేరుగా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
అరీట్ హాస్పిటల్స్,
గచ్చిబౌలి, హైదరాబాద్.
ఫోన్: 040-6969 6969
ఈమెయిల్: info@aretehospitals.com

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!