Friday, March 6, 2026
spot_imgspot_img

కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు

Must read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు.

ఈ భేటీకి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టుల నిధుల విడుదలపై వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర సహకారం కీలకమైన ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక బలాన్ని అందించేందుకు కీలకంగా మారుతుందని అంచనా.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!