రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవసరమవుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాజధానిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ. 77,249 కోట్లు అవసరం కాగా… వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఫండింగ్ రూ. 31,000 కోట్లు సమకూరాయని తెలిపారు. ఇంకా కావాల్సిన నిధులు రూ.47,000 కోట్లు అని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ అవసరాలు ఇవే..
1. పోలవరం-బనకచర్ల అనుసంధానం
2. తాగునీటి ప్రాజెక్టులు
3. ఐదు పర్యాటక హబ్‌లు(అమరావతి, విశాఖపట్నం, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం) ఐఐటీ తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్, బుద్ధిస్ట్ సర్క్యూట్, అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు
4. నాలెడ్జ్ ఎకానమీలో భాగమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, స్కిల్ డెవలప్మెంట్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 100 శాతం అక్షరాస్యత
5. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, ఇన్‌ల్యాండ్ వాటర్ వేలు, రహదారులు
6. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి రీజనల్ గ్రోత్ సెంటర్లు… ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్లు ఇచ్చేలా సిఫార్సులు చేయాలని ఆర్ధిక సంఘాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.