Friday, March 6, 2026
spot_imgspot_img

తెలంగాణలో ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Must read

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. బిల్లుల పెండింగ్ సమస్యను పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి.ఆసుపత్రుల ప్రతినిధుల సమాచారం ప్రకారం, ప్రభుత్వంపై రూ.1,300 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనీ, ఈ మొత్తాన్ని చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవలను నిలిపివేస్తామని ఇప్పటికే అధికారులకు లేఖ రాసినా స్పందన రాలేదని పేర్కొన్నారు.చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులు ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితి తలెత్తిందని, బకాయిలు చెల్లించకపోతే మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!