Thursday, September 3, 2026

Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు

Must read

Yasin Malik Divorce Wife Mushaal Tihar Jail Affidavit

Yasin Malik: జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాది యాసిన్ మాలిక్ తన భార్య ముషాల్ మాలిక్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని తీహార్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మాలిక్, శ్రీనగర్‌లోని టాడా/పోటా కోర్టులో 25 పేజీల అఫిడవితట్ దాఖలు చేశాడు. ఈ అఫిడవిట్‌లో తన భార్య నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.‘‘ముషాల్ తన మిగిలిన జీవితాన్ని ఈ పరిస్థితుల్లో భారంగా గడపడం, వితంతువుగా గడపడం నాకు ఇష్టం లేదు. ఆమె గౌరవంగా, ఆశతో తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నాడు.

‘‘నన్ను ఉరితీయక ముందే, నిన్ను వివాహ బంధం నుంచి విడిపించేలా నేను నిర్ణయించుకున్నాను’’ అంటూ తన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా తనను తాను నెల్సన్ మండేలాతో పోల్చుకున్నాడు. యాసిన్ మాలిక్ ప్రధానంగా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో తిహార్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై అనేక పాత కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 1990లో కాశ్మీరీ పండిట్ నర్సు సరళా భట్ హత్య, అదే సంవత్సరం వైమానిక దళ సిబ్బంది హత్య వంటివి ఉన్నాయి. సర్లా భట్ హత్యలో తనను తప్పుగా ఇరికిస్తున్నారని, ఈ హత్యలో తన ప్రమేయం లేదని యాసిన్ మాలిక్ ఖండిస్తున్నారు.

ముషాల్‌-యాసిన్ మాలిక్ ఎలా కలిశారు..

2005లో పాకిస్తాన్ లో యాసిన్ మాలిక్, ముషాల్ తొలిసారిగా కలుసుకున్నారు. ఉగ్రవాది యాసిన్ మాలిక్ కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ వెళ్లిన సమయంలో ఈ పరిచయం ఏర్పడింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాలిక్ ఫైజ్ కవిత్వాన్ని చదివాడు. ముషాల్ తన తల్లితో ఈ కార్యక్రమానికి హాజరైంది. దీని తర్వాత ఆమె మాలిక్ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకుంది. దీని తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి 2009లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉంది.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!