Saturday, June 6, 2026
Google search engine

నేను పోటీ చేయను, పార్టీ విజయం కోసం కృషి చేస్తా : దానం నాగేందర్

Must read

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఉప ఎన్నికల్లో తన పోటీపై వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, “నాకు ఆ నియోజకవర్గంలో పోటీ చేయాల్సిన ఉద్దేశ్యం లేదు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే” అని స్పష్టం చేశారు.

తాను పోటీ చేయకపోయినా, టిక్కెట్ ఎవరికి కేటాయించినా, పార్టీ విజయం కోసం తనవంతు కృషి చేస్తానని దానం నాగేందర్ తెలిపారు. “కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఈ ఉప ఎన్నికల కోసం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని నమ్మకం ఉంది. తనవంతు ప్రయత్నాల ద్వారా పార్టీ గెలుపు సాధించడంలో సహకరిస్తా” అని ఆయన వ్యాఖ్యానించారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అత్యంత కీలకమని దానం నాగేందర్ పేర్కొన్నారు.

ఆదర్శ్ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కొంత సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!