Fauzi : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ సినిమాపై ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్.. గ్లింప్స్‌తో హోప్ పెంచేశారు మేకర్స్. ఈ ఏడాది డిసెంబర్ 3న రిలీజ్ కావాల్సి ఉన్నా..షూటింగ్ పూర్తికాకపోవడంతో పాటు టెక్నికల్ ఇష్యూతో రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు.
2027 మార్చి 19న ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అప్పటివరకు షూటింగ్ కంప్లీట్ అవుతుందో లేదోనన్న డైలమా కంటిన్యూ అవుతోందట. దీంతో మార్చి 19thకు ఎట్టి పరిస్థితుల్లో ఫౌజీ మూవీని విడుదల చేసి తీరాలని.. సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్రభాస్ భావిస్తున్నారట.
అందుకే దర్శకుడు హను రాఘవపూడి సినిమాకు అవసరమైన షూటింగ్ పూర్తి చేసేందుకు ప్రభాస్ అదనపు డేట్స్ కూడా కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. షూటింగ్ ఆలస్యం కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా తగిన సమయం ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
ఫౌజీ రిలీజ్ డేట్ విషయంలో ప్రభాస్ ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి మరో కారణం కూడా ఉందని టాక్. ఫౌజీ వాయిదా పడితే.. ఆ ప్రభావం ప్రభాస్ మరో సినిమా స్పిరిట్ రిలీజ్ షెడ్యూల్‌పై కూడా పడే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఒక సినిమా ఆలస్యమైతే మరో సినిమా షూటింగ్ షెడ్యూల్స్, రిలీజ్ డేట్స్ అన్నీ మారిపోయే అవకాశం ఉందని అలర్ట్ అవుతున్నారట.
స్పిరిట్ షూటింగ్ నడుస్తుండగా.. ఇంకొన్ని సీక్వెల్స్ కూడా కమిట్ అయి ఉన్నాడు ప్రభాస్. అవన్నీ పూర్తి చేయాలంటే ఫౌజీని మార్చి 19న థియేటర్లలోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి ఫౌజీ సినిమా రిలీజ్ ప్లాన్ అనుకున్నట్లుగా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.




