నెక్స్ట్ వర్షిణి వచ్చి కెమిస్ట్రీ క్లాస్ తీసుకుంది. నెక్స్ట్ శ్వేతా వాళ్ళ అక్క వచ్చింది. శ్వేతా వాళ్ళ అక్కతో కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత శ్వేతా వాళ్ళ నాన్న రావడంతో హగ్ చేసుకొని ఏడ్చింది శ్వేతా. వాళ్ళ నాన్న కూడా ఎమోషనల్ అయ్యారు. శ్వేతా త్రిగున్ సపోర్ట్ గురించి చెప్పడంతో త్రిగున్ తో మాట్లాడారు వాళ్ళ నాన్న. చివర్లో అందరూ కలిసి డ్యాన్స్ వేశారు. ఫుడ్ రింగ్ గేమ్ శ్వేతా వాళ్ళ నాన్నకు కూడా ఇచ్చారు బిగ్ బాస్.
నెక్స్ట్ వంశీ కూతురు వచ్చింది. వంశీని హగ్ చేసుకోగానే వంశీ ఎమోషనల్ అయి ఏడ్చాడు. కూతురు కోసం వంశీ ఫుడ్ స్వయంగా వండాడు. తన కెప్టెన్ రూమ్ కి తీసుకెళ్లాడు. తర్వాత వంశీ వైఫ్ వచ్చింది. తన భార్యని హగ్ చేసుకొని వంశీ ఏడ్చేశాడు. త్రిగున్ సపోర్ట్ చేస్తున్నందుకు స్పెషల్ గా బ్రో అంటూ థ్యాంక్యూ చెప్పింది. త్రిగున్ వంశీ కూతురుతో ఆడుకున్నాడు. వంశీ – అతని భార్య కూర్చొని మాట్లాడుకున్నారు. త్రిగున్ కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడాడు. నీలాంటి ఫ్రెండ్ ఉండాలి అని, మీ మైండ్ అలా గేమ్ ఆలోచించడం గ్రేట్ అని వంశీ వైఫ్ చెప్పింది. వంశీ వైఫ్ అందరితో మాట్లాడింది. చివర్లో వంశీ భార్య, కూతురుకు కూడా ఫుడ్ రింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక రేపు స్కూల్ టాస్క్, ఫ్యామిలీ వీక్ కొనసాగనుంది.


