- ఈ దీపావళికి కారు కొంటున్నారా? రూ.1.25 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
- దీపావళి ధమాకా.. హోండా, హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు
- హోండా సిటీ నుంచి అమేజ్ వరకు.. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు
Diwali Car Offers 2026 : దీపావళి వచ్చిందంటే పండగ సందడి మాత్రమే కాదు.. కొత్త వస్తువులు కొనేందుకు కూడా ఇదే బెస్ట్ టైమ్.. ముఖ్యంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి కార్ల కంపెనీలు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ బెనిఫిట్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. 2026 దీపావళి సందర్భంగా హోండా, హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు అందిస్తున్న 4 కార్ల ఆఫర్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన కారు ఇంటికి తెచ్చుకోవచ్చు..
1. హోండా సిటీ (Honda City) :
ఈ లిస్టులో అత్యధికంగా రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది హోండా సిటీ. పెట్రోల్ వేరియంట్లపై రూ.60 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.50 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి. ఇప్పటికే హోండా కారు ఉన్నవారికి అదనంగా రూ.6 వేల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.4 వేల లాయల్టీ బోనస్, రూ.5 వేల కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి.
అంతేకాదు.. రూ.19 వేల విలువైన ఫ్రీ డాష్‌క్యామ్, ఎక్స్టెండెడ్ వారంటీపై రూ.16,900 వరకు తగ్గింపు కూడా ఉంది. ధర రూ.12.08 లక్షల నుంచి రూ.17.44 లక్షల వరకు ఉంటుంది. హైబ్రిడ్ మోడల్‌కు మాత్రం తక్కువ ఆఫర్లు ఉన్నాయి.
2. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) :
స్పోర్టీ లుక్, పవర్ఫుల్ డ్రైవింగ్ కోరుకునేవారికి వర్టస్ బెస్ట్ ఆప్షన్.. ఈ కారుపై రూ.80 వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ.50 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.30 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ధర రూ.10.71 లక్షల నుంచి రూ.19.20 లక్షల వరకు ఉంది.
Read Also :
3. హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) :
వెర్నాపై రూ.80 వేల వరకు ఆఫర్లు పొందవచ్చు.. రూ.40 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.10 వేల కార్పొరేట్ బోనస్‌తో పాటు పాత కారు స్క్రాప్ చేస్తే రూ.25 వేల వరకు, ఎక్స్ఛేంజ్పై రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ధర రూ.10.99 లక్షల నుంచి రూ.18.31 లక్షల వరకు పొందవచ్చు..
4. హోండా అమేజ్ (Honda Amaze) :
తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ సెడాన్ కావాలనుకునేవారికి అమేజ్ బెస్ట్ ఆప్షన్. దీనిపై రూ.43 వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.. రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.21 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4 వేల లాయల్టీ బోనస్, రూ.3 వేల కార్పొరేట్ బెనిఫిట్ లభిస్తాయి. ధర రూ.7.65 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది.
ఈ పండగ ఆఫర్లు వేరియంట్, సిటీ, డీలర్షిప్, అర్హతలను బట్టి మారవచ్చు. కొనుగోలు చేసే ముందు షోరూమ్‌లో వివరాలు తెలుసుకోవడం బెటర్..



