ఢిల్లీలో ఇండీ కూటమి ‘ఓట్ బచావో’ ర్యాలీ.. 4,000 మంది పోలీసులతో బందోబస్తు.. రాజధానిలో హై అలర్ట్!

Must read

Vote Bachao Desh Dachao Rally: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ (INDIA) కూటమి దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ‘ఓట్ బచావో, దేశ్ బచావో(Vote Bachao Desh Dachao Rally)’ పేరుతో భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలతో పాటు ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నాయకులు, విపక్ష శ్రేణులు వేలాదిగా ఢిల్లీకి చేరుకోవడంతో రాజధాని పరిసరాల్లో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది.

రాంలీలా మైదానంలో భారీ బందోబస్తు.. 4,000 మంది పోలీసులు, 200 సీసీ కెమెరాలతో నిఘా:

ఈ మహా ర్యాలీ కోసం రాంలీలా మైదానంలో సుమారు 1.5 లక్షల మంది పట్టేలా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ర్యాలీ నిర్వహణ పరిసరాల్లో భద్రత కోసం దాదాపు 4,000 మంది పోలీసులను మోహరించడమే కాకుండా 200 సీసీటీవీ కెమెరాలతో పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. మింటో రోడ్ – కనాట్ ప్లేస్ జంక్షన్ నుంచి రాంలీలా మైదాన్ వరకు భారీ మార్చ్ సాగనుండటంతో సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలు చేస్తున్నారు.

రాహుల్ గాంధీ పిలుపు.. ఇండీ కూటమి బలప్రదర్శన, ప్రధాన వేదికపై కీలక నేతల ప్రసంగాలు:

మహా నిరసనలో పాల్గొనే వారు వ్యాపారులకు కూడా మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ర్యాలీ ప్రాంగణంలో ప్రతిపక్షాల కోసం ప్రత్యేకంగా రెండు వేదికలను రూపొందించగా, ప్రధాన వేదికను భారీ త్రివర్ణ పతాకంతో అలంకరించారు. ఇండీ కూటమికి చెందిన కీలక నేతలందరూ ఒకే వేదికపైకి రానుండటంతో ఈ కార్యక్రమం ప్రతిపక్షాల బలప్రదర్శనగా మారింది. సజావుగా సాగేలా వీఐపీల ప్రవేశానికి గేట్ 1, సాధారణ ప్రజలకు 5 ద్వారాలను కేటాయించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!