Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు హైస్కూల్లో సైకో వీరంగం సృష్టించాడు. పదో తరగతి చదువుతున్న విద్యార్థునులపై చేశాడు. రంపంతో ఓ విద్యార్థిని గొంతుపై దాడిచేశాడు. దీంతో విద్యార్థిని కిందపడిపోయింది. ఈ క్రమంలో సమీపంలోనే ఉన్న మరో విద్యార్థిని సైకో దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆ విద్యార్థినిపైనా సైకో దాడికి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అక్కడేఉన్న మరికొందరు విద్యార్థినులపైనా సైకో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా.. మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థినులకు గాయాలైనట్లు తెలిసింది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
ఏపీలో దారుణ ఘటన.. పాఠశాలలో టెన్త్ విద్యార్థినుల గొంతు కోసిన సైకో.. ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం



