- నవంబర్ 5న దీపావళి బోనస్
- ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 చెల్లింపు
- 38 వేల మంది కార్మికులకు రూ.419 కోట్ల బోనస్
- నెల రోజుల్లో రూ.2.65 లక్షల వరకు ప్రయోజనం
Singareni Workers : పండుగ వేళ సింగరేణి కార్మికులకు మరో శుభవార్త.. ఇప్పటికే దసరా బోనస్‌తో సంతోషంలో ఉన్న కార్మికులకు యాజమాన్యం మరో తీపివార్త అందించింది. దీపావళి సందర్భంగా భారీ మొత్తంలో బోనస్ చెల్లించేందుకు నిర్ణయించింది. నవంబర్ 5వ తేదీన అర్హులైన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈసారి దీపావళి బోనస్ కోసం ఏకంగా రూ.419 కోట్లను కేటాయించడం విశేషం.. సంస్థలో పనిచేస్తున్న సుమారు 38 వేల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది. అర్హత ఉన్న ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.1,10,250 వరకు అందనుంది.
Read Also :
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ చెల్లింపులు చేపడుతున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. అయితే ఈ ప్రయోజనం అందరికీ వర్తించదు. నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (NCWA) పరిధిలోని కార్మికులకు మాత్రమే బోనస్ చెల్లించనున్నారు. అధికారులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు.
వీరికి మాత్రమే బోనస్ :
అర్హత విషయంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. కనీసం 30 రోజుల పాటు విధులు నిర్వహించిన కార్మికులకే ఈ బోనస్ అందుతుంది. ఉద్యోగి పనిచేసిన రోజులను పరిగణనలోకి తీసుకుని చెల్లింపు మొత్తాన్ని నిర్ణయిస్తారు. పూర్తి అర్హత ఉన్నవారికి ప్రకటించిన గరిష్ఠ మొత్తం లభిస్తుంది.
ఇక దసరా, దీపావళి బోనస్‌లను కలిపి చూస్తే సింగరేణి కార్మికులకు నెల రోజుల వ్యవధిలోనే భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనం దక్కనుంది. రెండు చెల్లింపుల ద్వారా ఒక్కో కార్మికుడికి సగటున రూ.2.65 లక్షల వరకు అందే అవకాశం ఉంది. ఈ రెండు బోనస్‌ల కోసం సంస్థ మొత్తం సుమారు రూ.1,020 కోట్లను వెచ్చించనుంది.



