Baddukonda Appalanaidu : వైసీపీకి మరో షాక్.. టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు!

Must read

Baddukonda Appalanaidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. విశాఖపట్టణంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. బడ్డుకొండతో పాటు ఆయన కుమారుడు, ఇతర నాయకులు కూడా టీడీపీలో చేరారు. వారికి పల్లా శ్రీనివాసరావు, అనిత పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Also Read : PM Kisan-Annadata Sukhibhava : ఏపీలోని రైతులకు శుభవార్త.. ఒక్కో రైతు బ్యాంక్ ఖాతాలో రూ.7వేలు.. డబ్బులు పడకుంటే ఇలా చేయండి

బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీ మార్పు వెనుక ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఆయన వియ్యంకుడు, మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో విజయనగరం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కన్నీటి పర్యాంతమయ్యారు. చిన్న శ్రీను బొత్స సత్యనారాయణ మేనల్లుడు. అప్పటి వరకు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, భీమిలి ఇంఛార్జి పదవుల్లో ఉన్న చిన్న శ్రీను ఆ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం టీడీపీలో చేరిన బడ్డుకొండ అప్పలనాయుడును ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు రావడం, క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అంతకుముందు ఆయనను నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి కూడా తప్పించింది.

చిన్నశ్రీను పార్టీని వీడి టీడీపీలో చేరిన తర్వాత బడ్డుకొండ విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఆయన కూడా టీడీపీలో చేరడంతో వైసీపీకి మరో ముఖ్య నాయకుడు దూరమైనట్లయింది.

బడ్డుకొండ అప్పలనాయుడు గతంలో నెల్లిమర్ల ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఆయనకు నియోజకవర్గంలో రాజకీయ అనుభవంతో పాటు అనుచరగణం కూడా ఉంది. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరడం వల్ల స్థానిక రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బడ్డుకొండ చేరిక టీడీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆయనకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? అనే అంశాలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!