IND vs NZ : ఆక్లాండ్ వేదికగా శుక్రవారం (అక్టోబర్ 30) భారత్ vs న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయినప్పటికి కూడా భారత జట్టు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఈ క్రమంలో నాలుగో టీ20 మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
మరోవైపు ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ 4వ టీ20 మ్యాచ్‌లో గెలిచి భారత ఆధిక్యాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఇక ఆక్లాండ్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం అన్న అంచనాల నేపథ్యంలో మరో సారి అభిమానులు పరుగుల వరదను చూసే అవకాశం ఉంది.
ఎక్కడ చూడొచ్చంటే?
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్ జియో హాట్‌స్టార్‌లో రాదు. ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్వర్క్ కలిగి ఉంది. ఈ క్రమంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటీటీలో అయితే.. సోనీ లివ్ యాప్, వెబ్సైట్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
తుది జట్ల అంచనా..
భారత్.. సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌సింగ్, ప్రిన్స్ యాదవ్.
న్యూజిలాండ్.. టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్.



