ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించే జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశాలను అందిపుచ్చుకుని ఉద్యోగం పొందడంతో పాటు మరొకరి ఉద్యోగ అవకాశం కల్పించే స్థాయికి యువత ఎదగాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి.ఆర్.డి.ఎ – సీడాప్ సంయుక్తంగా 2025 సంవత్సరానికి సంబంధించి NTR జిల్లాలో నిర్వహించనున్న జాబ్ మేళాల తేదీలు, నిర్వహించే ప్రదేశాల వివరాలతో రూపొందించిన క్యాలెండర్ ను ఎంపి కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జాబ్ మేళాను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం లోని “నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొవాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎన్.ఐ.ఆర్.డి ప్రొగ్రామ్ నోడల్ ఆఫీసర్ ఎ.ఎన్.వి.నాంచారరావు, డిస్ట్రిక్ ఎంప్లామెంట్ ఆఫీసర్ వై.ఎస్.బ్రహ్మాం, ఎన్టీఆర్ జిల్లా స్కిల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (డి.ఎస్.డి.వో) ఎస్.శ్రీనివాసరావు, జిల్లా ఎ.డి.ఎస్.డి.వో దుర్గాప్రసాద్, సిడాప్ (SEEDAP) జె.డి.ఎమ్ (జాబ్స్ డిస్ట్రిక్ మేనేజర్) సుమలత పాల్గొన్నారు.
జాబ్ మేళా క్యాలెండర్-2025 ఆవిష్కరించిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వసంత
