పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. కేసీఎఫ్ మాడ్యూల్‌కు చెందిన ఇద్దరు అరెస్ట్.. నాలుగు గ్రెనేడ్లు, పిస్టళ్లు స్వాధీనం!

Must read

Punjab Terror Plot Foiled: పంజాబ్‌లో భారీ ఉగ్రదాడి కుట్రను భద్రతా దళాలు సమర్థవంతంగా భగ్నం చేశాయి. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) ఉగ్ర మాడ్యూల్‌కు చెందిన ఇద్దరు నిందితులను పంజాబ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌బీఎస్ నగర్ జిల్లాలో జరిగిన ఈ సంయుక్త ఆపరేషన్‌లో నిందితుల నుంచి నాలుగు 86-పీ హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు 9 ఎంఎం పిస్టళ్లు, 20 లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఈ మాడ్యూల్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. పక్కా సమాచారంతో అమృత్‌సర్ స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (ఎస్ఎస్ఓసీ), జలంధర్ కౌంటర్ ఇంటెలిజెన్స్, మరో కేంద్ర దర్యాప్తు సంస్థ కలిసి ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయి.

బెహ్రామ్ వద్ద ఆయుధాల సేకరణ.. కీలక ఆధారాలు:

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విదేశీ హ్యాండ్లర్ల సూచనల మేరకు నిందితులు ఎస్‌బీఎస్ నగర్‌లోని బెహ్రామ్ సమీపంలోని ఒక ప్రాంతం నుంచి ఈ ఆయుధాలు, పేలుడు(Punjab Terror Plot Foiled) పదార్థాల కన్సైన్‌మెంట్‌ను సేకరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై బీఎన్ఎస్ యాక్ట్, ఆయుధ చట్టం-1959, పేలుడు పదార్థాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్థానిక మద్దతుదారులు ఎవరున్నారు, నెట్‌వర్క్ మూలాలు ఎక్కడిదాకా విస్తరించాయన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు; శాంతిభద్రతల పరిరక్షణ, ఉగ్ర నెట్‌వర్క్‌ల నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని డీజీపీ స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article