స్టాలిన్‌తో ఇండియా కూటమి చర్చలు విఫలం.. మరో మార్గం లేదన్న ఎంకే స్టాలిన్.. కాంగ్రెస్‌కు షాక్!

Must read

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు విషయంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతుండగా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల చర్చలు కొలిక్కి రాలేదు. ఈ సాయంత్రం చెన్నైలోని స్టాలిన్ నివాసానికి వెళ్లిన విపక్ష కూటమి నేతలు గంటన్నరకు పైగా చర్చలు జరిపి, డీలిమిటేషన్ బిల్లుపై(Delimitation Bill) కేంద్రానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. నిన్న ప్రకటించిన తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్టాలిన్ తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం అగ్రనేత ఎంఏ బేబీ సహా పలువురు విపక్ష కూటమి నేతలు ఆయన నివాసం నుంచి వెనుదిరిగారు.

850 సీట్ల పెంపు ప్రమాదకరం.. రాహుల్ గాంధీ హెచ్చరిక:

స్టాలిన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, లోక్‌సభ సీట్లను 850కి పెంచేందుకు సహకరించొద్దని స్టాలిన్‌ను కోరినట్లు వెల్లడించారు. ఈ బిల్లు దేశ రాజకీయ చిత్రపటాన్ని మారుస్తుందని, డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభ సీట్లు 850కి పెంచడం దేశానికే కాదు, తమిళనాడుకు కూడా ప్రమాదకరమని పేర్కొంటూ, తమిళనాడుకు నష్టం చేసే నిర్ణయాన్ని స్టాలిన్ అంగీకరించరని భావిస్తున్నట్లు చెప్పారు. తమిళ సంస్కృతిని నాశనం చేసేందుకు ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, 850 సీట్ల పెంపుతో భారత్‌లో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని, తమిళ భాష, సంస్కృతికి ప్రమాదం పొంచి ఉందని స్టాలిన్‌కు చెప్పినట్లు తెలిపారు.

మరో మార్గం లేదన్న స్టాలిన్.. కనీస రక్షణ కోసం మద్దతు:

మరోవైపు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం తప్ప తమకు మరో మార్గం లేదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. సరైన ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్ చూపించలేకపోయిందని పేర్కొన్న ఆయన, ఒకవేళ ఈ బిల్లు ఓడిపోతే తమిళనాడుకు ఉన్న కనీస రక్షణ కూడా పోతుందని తేల్చి చెప్పారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article