ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లాస్ట్ ఛాన్స్.. ఐఫోన్ 17పై ఖతర్నాక్ డిస్కౌంట్.. రూ.85 వేలకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

Must read

  • ఐఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..
  • ఐఫోన్ 17 నుంచి శాంసంగ్ గెలాక్సీ వరకు..
  • ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్స్.. ఈరోజే లాస్ట్ ఛాన్స్

Flipkart Black Friday Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా కొత్త ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2026 నేటితో ముగియనుంది. ఈ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు..

రూ.13,900 వరకు తగ్గింపు :
ఆపిల్ ఐఫోన్ 17 (256GB) అసలు రిటైల్ ధర రూ.99వేలు కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.89,100కే లభిస్తోంది. అంటే.. ఇప్పటికే రూ.10,800 తగ్గింపు అందిస్తోంది. అదనంగా ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంకు లేదా ఫ్లిప్ కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.4వేలు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ వర్తిస్తే ఫోన్ ధర రూ.85,100కు తగ్గుతుంది.

క్రెడిట్ కార్డులు లేని వారు కూడా కొన్ని యూపీఐ ఆఫర్లను చెక్ చేయొచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, క్రెడ్, సూపర్ మనీ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా అర్హత లావాదేవీలపై రూ.1,101 వరకు బెనిఫిట్ పొందవచ్చు.
ఇక పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.53,750 వరకు ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్ పొందొచ్చు. అయితే, ఈ ఫోన్ మోడల్, కండిషన్, అర్హతను బట్టి ఈ వాల్యూ మారుతుంది.

ఇతర ఫోన్లపైనా భారీ ఆఫర్లు :
ఈ సేల్‌లో ఐఫోన్ 16 ధర రూ.56,999, ఐఫోన్ 14 ధర రూ.44,499గా ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 10 రూ.67,999కు, శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ధర రూ.31,999కు లభిస్తున్నాయి. వివో T4 అల్ట్రా 5జీ రూ.34,999, ఒప్పో రెనో 14 5జీ రూ.34,200 ధరకు లభ్యమవుతున్నాయి.

ఐఫోన్ 17 ప్రత్యేకతలివే :
ఆపిల్ ఐఫోన్ 17లో 6.3 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్, ఎ19 చిప్‌సెట్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ రెండు 48MP కెమెరాలు, ఫ్రంట్ 18MP కెమెరా అందించారు. అయితే, బ్యాంక్, యూపీఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు ఒకేసారి వర్తిస్తాయని అనుకోకూడదు. కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో ఫైనల్ ధర, ఆఫర్లు తప్పనిసరిగా చెక్ చేసుకోండి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article