తిరుమల శ్రీవారికి అలంకరించే స్వర్ణాభరణాలు ఇవే.. ఏ ఆభరణం ఎక్కడ దరింపజేస్తారంటే? వాటి ప్రత్యేకతలివే..

Must read

Lord Venkateswara Gold Ornaments : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నిత్యం సరికొత్త అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంటారు. స్వామివారి అలంకరణలో ఉపయోగించే ప్రతి ఆభరణానికి ఓ ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. పాదాల నుంచి శిరస్సు వరకు బంగారు, రత్నాభరణాలతో స్వామివారిని అలంకరిస్తారు. ఇలా ప్రతిరోజూ స్వామివారి అలంకరణకు సుమారు 120 కిలోల బరువున్న ఆభరణాలను ఉపయోగిస్తుండగా.. తాజాగా ఓ అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల స్వర్ణాభరణాలను కానుకగా అందించనున్నారు. సుమారు రూ.160 కోట్ల విలువైన ఈ ఆభరణాలు శ్రీవారి అలంకరణలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

శ్రీవారి అలంకరణలో 40 రకాల ఆభరణాలు..
♦ శ్రీవారి నిత్యాలంకరణలో దాదాపు 40 రకాల స్వర్ణాభరణాలను ఉపయోగిస్తారు. వీటిలో ఒక్కో ఆభరణానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
♦ స్వర్ణ పద్మపీఠం : పాదాల కింద ఉండే బంగారు పీఠం
♦ స్వర్ణ పాదాలు : పాదాలకు అలంకరించే బంగారు కవచాలు
♦ నూపురాలు : పాదాలకు ధరించే ఆభరణాలు
♦ కాంచిగుణం : నడుముకు ధరించే ఆభరణం
♦ దశావతార రశన : దశావతార చిత్రాలతో కూడిన నడుము ఆభరణం
♦ సాలగ్రామ హారం : అత్యంత ప్రత్యేకమైన హారం
♦ తులసి హారం : బంగారంతో రూపొందించిన తులసి ఆకుల హారం
♦ అష్టోత్తర హారం : 108 నామాలతో కూడిన హారం
♦ సహస్రనామ హారం : వేయి నామాలతో కూడిన హారం
♦ చతుర్భుజ లక్ష్మీ హారం : లక్ష్మీదేవి ప్రతిమతో కూడిన హారం
♦ చంద్రహారం : పొడవైన బంగారు
♦ యజ్ఞోపవీతం : బంగారు పవిత్ర దారం
♦ సూర్య కఠారి : బంగారు ఖడ్గం
♦ నాగాభరణాలు : చేతులకు, భుజాలకు ధరించే ఆభరణాలు
♦ శంఖు, చక్రాలు : రత్నాలు పొదిగిన ఆభరణాలు
♦ కర్ణపత్రాలు : చెవులకు ధరించే ఆభరణాలు
♦ కిరీటం : స్వర్ణ, రత్న కిరీటాలు

సాధారణంగా సుమారు 120 కిలోల బరువు ఉన్న ఆభరణాలు స్వామివారికి ప్రతినిత్యం అలంకరిస్తారు. తాజాగా ఓ అజ్ఞాత భక్తుడు దానికంటే ఒక కిలో అదనంగా అంటే 121 కిలోల బరువు గల స్వర్ణ ఆభరణాలను స్వామివారికి బహుకరించారు. ఇందులో మొత్తం 40 ఆభరణాలు ఉంటాయి. వీటి విలువ సుమారు 160కోట్ల రూపాయలు ఉంటుంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article