రూ.48,999 రియల్‌మి P4s 5G ఫోన్ జస్ట్ రూ.29 వేలకే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

Must read

  • కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా?
  • రియల్‌మి పీ4ఎస్ 5జీపై అదిరిపోయే ఆఫర్లు
  • భారీ బ్యాటరీతో రియల్‌మి 5జీ ఫోన్..
  • ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్ ఇదేనా?

Realme P4s 5G Price : స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్న వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీకి చెందిన Realme P4s 5G మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పెద్ద బ్యాటరీ, మంచి డిస్‌ప్లే, రోజువారీ అవసరాలకు సరిపోయే పనితీరు కోరుకునే వారికి ఈ ఫోన్ ఓ మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.

రూ.29,449కే కొనుగోలు చేసే ఛాన్స్ :
రియల్‌మి పీ4ఎస్ 5జీ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.48,999గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.32,999కే అందుబాటులో ఉంది. దీనికి అదనంగా రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే.. మరో రూ.3,550 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్లతో వావ్ డీల్ ధర రూ.29,449కు తగ్గుతుంది. అయితే, క్యాష్‌బ్యాక్ నిబంధనలు, రూ.199 ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజు కూడా ఉంది.

బ్యాటరీనే అసలైన హైలైట్ :
ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. మీడియాటెక్ డైమన్షిటీ 7400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉండటంతో రోజువారీ యాప్స్, వీడియో స్ట్రీమింగ్, లైట్ గేమింగ్‌కు అద్భుతంగా ఉంటుంది.

కెమెరా విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరాతో 2MP అదనపు కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 7,000mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా :
పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే.. గరిష్ఠంగా రూ.23,900 వరకు తగ్గుతుంది. అదనంగా రూ.3,650 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందవచ్చు. అయితే, పాత ఫోన్ మోడల్, కండిషన్‌ను బట్టి అసలు ధర తగ్గుతుంది.

మొత్తంగా భారీ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ, 120Hz స్క్రీన్ కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. కొనుగోలు చేసే ముందు అన్ని ఆఫర్ల నిబంధనలు, ఫైనల్ ధరను ఒకసారి చెక్ చేసుకోండి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article