పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే ప్రభుత్వ బ్యాంకులివే..!

Must read

  • తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణం..
  • ఏ ప్రభుత్వ బ్యాంకులో ఎంతంటే?
  • లోన్ తీసుకునే ముందు మర్చిపోకండి

Personal Loan Interest Rates : అనుకోకుండా డబ్బు అవసరమైతే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది పర్సనల్ లోన్. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, వైద్య అవసరాలు, పెళ్లిళ్లు.. ఇలా కారణం ఏదైనా చేతిలో డబ్బు లేకపోతే వ్యక్తిగత రుణం వైపు చూస్తుంటారు.

అయితే, లోన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, దానిపై ఎంత వడ్డీ పడుతుందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే.. ఒకే మొత్తానికి (Personal Loan Interest Rates) ఒక బ్యాంకులో తక్కువ వడ్డీ ఉంటే, మరో బ్యాంకులో ఎక్కువ వడ్డీ ఉండొచ్చు..

ఏయే బ్యాంకులో వడ్డీ ఎంతంటే? : 
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9.05 శాతం నుంచి వడ్డీ రేట్లు ఉన్నాయి. కెనరా బ్యాంకులో 9.70 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 10.15 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో 10.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10.85 శాతం నుంచి వడ్డీ రేట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, ఇక్కడో ఒకటి గుర్తుంచుకోవాలి. ఇవి ప్రారంభ వడ్డీ రేట్లు మాత్రమే. ప్రతి ఒక్కరికీ ఇదే రేటుకు రుణం వస్తుందని చెప్పలేం. మీ ఆదాయం, ఉద్యోగం, క్రెడిట్ స్కోర్, గతంలో తీసుకున్న రుణాల చెల్లింపు హిస్టరీ ఆధారంగా బ్యాంకులు వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.

లోన్ తీసుకునే ముందు ఇవి తప్పనిసరి :
పర్సనల్ లోన్‌కు అప్లయ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ముందుగా వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చాలి. నెలవారీ ఈఎంఐ ఎంత అవుతుంది? జీతంలో నుంచి ఇంటి ఖర్చులు పోను ఆ మొత్తం కట్టగలమా? అని లెక్క వేసుకోవాలి..

అంతేకాదు, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు, ముందస్తు చెల్లింపు రుసుములు కూడా తెలుసుకోవాలి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి రుణం పొందే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ కనిపించిందని వెంటనే లోన్ తీసుకోకండి. మొత్తం రుణ కాలానికి మీరు చెల్లించే వడ్డీ, ఇతర ఖర్చులు లెక్క వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం ఎంతైనా బెటర్..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article