రేవంత్‌ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నారు.. నెక్స్ట్ ఎలెక్షన్స్ లో ఓటమి తప్పదు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!

Must read

Etala Rajender: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటూ భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం హుజురాబాద్‌లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి వంద శాతం ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. 90 శాతం సీట్లు సాధిస్తామంటూ సీఎం భ్రమ పడుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాబోయే పది నుంచి పదిహేను ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఆ మాట స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారని ఈటల పేర్కొన్నారు.

అవినీతిపై చర్యలేవి.. ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం:

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకుందని ఈటల రాజేందర్(Etala Rajender) నిలదీశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ అభివృద్ధికి తానేమీ చేయలేదంటూ విమర్శించే వారు, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించిన చెక్ డ్యాములు, పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులను ప్రత్యక్షంగా చూడాలని సూచించారు.

కౌషిక్‌రెడ్డి హామీలపై ఈటల నిలదీత.. ఆనాటి వ్యవహారాల ప్రస్తావన:

హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచార సమయంలో రూ.1,000 కోట్ల నిధులు తీసుకొస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్‌రెడ్డి చిన్న పిల్లలతో చెప్పించారని, ఆ హామీని ఇప్పుడెందుకు నెరవేర్చడం లేదని ఈటల ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ, చచ్చిపోతామంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article