- బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్..
- డిసెంబర్లో ఈ తేదీల్లో బ్యాంకులు బంద్
- డిసెంబర్లో బ్యాంకు పనులున్నాయా?
- అయితే ఈ సెలవుల లిస్ట్ చూసుకోండి
December 2026 Bank Holidays : బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పని ఉందా? డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, విత్‌డ్రా చేయాలన్నా, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా కాస్త ముందే ప్లాన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే.. డిసెంబర్ నెలలో పలు తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. దీంతో బ్యాంకు పనులపై ఆధారపడే కస్టమర్లు ముందుగానే అప్రమత్తంగా ఉండండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన డిసెంబర్ 2026 సెలవుల జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక రోజులను బట్టి బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.
డిసెంబర్లో ముఖ్యమైన సెలవులివే.. :
డిసెంబర్ 1న ఇండిజినస్ ఫెయిత్ డే, స్టేట్ ఇనాగురేషన్ డే సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 3న గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పర్వదినం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇక డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సిక్కింలో లోసూంగ్, నామ్సూంగ్ పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
డిసెంబర్ 18న మేఘాలయలో యుసోసో థామ్ వర్ధంతి, 19న గోవా విమోచన దినోత్సవం సందర్భంగా బ్యాంకులు మూతపడతాయి. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. అలాగే, డిసెంబర్ 30న మేఘాలయలో, 31న మిజోరంలో ప్రత్యేక సెలవులు ఉన్నాయి..
డిజిటల్ సేవలకు ఇబ్బంది ఉండదా? :
బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉన్నా సాధారణంగా యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సర్వీసులు అందుబాటులో ఉంటాయి. గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్‌ల ద్వారా క్యాష్ పేమెంట్లు, బిల్లు పేమెంట్లు చేసుకోవచ్చు. ఆన్లైన్ (NEFT, RTGS) సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి.
అయితే, బ్రాంచ్‌కు వెళ్లి చేయాల్సిన పనులు ఉంటే సెలవులకు ముందే కంప్లీట్ చేసుకోవడం బెటర్.. ముఖ్యంగా క్యాష్ పేమెంట్లు, చెక్ డిపాజిట్లు, ఇతర ముఖ్యమైన పనుల విషయంలో చివరి నిమిషం వరకు వేచి చూడొద్దు.. మరో ముఖ్యమైన విషయం.. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయి. మీ ప్రాంతంలోని బ్యాంకు సెలవులను ఒకసారి చెక్ చేసుకున్నాకే వెళ్లండి..
బ్యాంకు సెలవుల ఫుల్ లిస్ట్ వివరాలివే..
- డిసెంబర్ 1 : ఇండిజినస్ ఫెయిత్ డే / స్టేట్ ఇనాగురేషన్ డే (అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్)
- డిసెంబర్ 3 : సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పర్వదినం (గోవా)
- డిసెంబర్ 6 : ఆదివారం
- డిసెంబర్ 9 : లోసూంగ్ / నామ్సూంగ్ : (సిక్కిం)
- డిసెంబర్ 10 : లోసూంగ్ / నామ్సూంగ్ (సిక్కిం)
- డిసెంబర్ 11 : లోసూంగ్ / నామ్సూంగ్ (సిక్కిం)
- డిసెంబర్ 12 : రెండో శనివారం :
- డిసెంబర్ 13 : ఆదివారం :
- డిసెంబర్ 18 : యు సోసో థామ్ వర్ధంతి (మేఘాలయ)
- డిసెంబర్ 19 : గోవా విమోచన దినోత్సవం (గోవా)
- డిసెంబర్ 20 : ఆదివారం
- డిసెంబర్ 24 : క్రిస్మస్ ఈవ్ : మేఘాలయ, మిజోరం, నాగాలాండ్
- డిసెంబర్ 25 : క్రిస్మస్
- డిసెంబర్ 26 : నాలుగో శనివారం
- డిసెంబర్ 27 : దేశవ్యాప్తంగా (ఆదివారం)
- డిసెంబర్ 30 : యు కియాంగ్ నాంగ్‌బా వర్ధంతి (మేఘాలయ)
- డిసెంబర్ 31 : నూతన సంవత్సర వేడుకలు (మిజోరం)




