కేంద్రం సూపర్ స్కీమ్.. భార్యాభర్తలిద్దరికీ నెలకు రూ.10 వేల పెన్షన్.. రూ.210 సేవింగ్ చాలు..!

Must read

  • 60 ఏళ్ల తర్వాత ప్రతినెలా రూ.5,000 పెన్షన్
  • కేంద్రం అందిస్తున్న ఈ పథకం గురించి తెలుసా?
  • అటల్ పెన్షన్ యోజన పూర్తి వివరాలు

Atal Pension Yojana : వృద్ధాప్యంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడకూడదని చాలామంది అనుకుంటారు.. ఉద్యోగం ఉన్నా, వ్యాపారం చేస్తున్నా.. రిటైర్మెంట్ తర్వాత ప్రతినెలా కొంత ఆదాయం ఉంటే ఆ ధైర్యమే వేరు.

అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో చిన్న మొత్తంతో పొదుపు చేస్తూ 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరెవరు ఈ పథకంలో చేరవచ్చు? :
అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు ఉండాలి. అయితే, ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు ఈ పథకంలో కొత్తగా చేరేందుకు అర్హులు కాదు. 2022 అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. అర్హత ఉన్నవారు బ్యాంకు లేదా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా ద్వారా ఈ పథకంలో చేరవచ్చు.

నెలకు ఎంత కట్టాలి? :
ఈ పథకంలో మీరు ఎంచుకునే పెన్షన్ మొత్తం, చేరే వయస్సును బట్టి నెలవారీ చందా మారుతుంది. ఉదాహరణకు.. 18 ఏళ్ల వయస్సులో చేరి నెలకు రూ.5,000 పెన్షన్ ఎంపిక చేసుకుంటే ప్రతినెలా రూ.210 చెల్లించాలి. ఇలా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు చందా కడుతూ ఉండాలి. ఆ తర్వాత నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000 లేదా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు.

భార్యాభర్తలకు ఫుల్ బెనిఫిట్స్ :
ఈ పథకంలో ఖాతాదారుడు మరణిస్తే.. జీవిత భాగస్వామికి ఆ పెన్షన్ అందుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత నామినీకి నిర్ణీత మొత్తం చెల్లిస్తారు. భార్యాభర్తలిద్దరూ అర్హత ఉంటే విడివిడిగా ఖాతాలు ఓపెన్ చేసి నెలకు రూ.10,000 వరకు పెన్షన్ పొందవచ్చు. మొత్తంగా చూస్తే.. చిన్న మొత్తంతో భవిష్యత్తుకు భరోసా కల్పించాలనుకునే వారికి ఏపీవై అద్భుతమైన పథకం. అయితే చేరే ముందు వయస్సు, నెలవారీ చందా, నిబంధనలు తెలుసుకోండి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article