ఏపీ పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత.. అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనంపై దాడి.. కారు అద్దాలు ధ్వంసం

Must read

AP Panchayat Election: నంద్యాల జిల్లాలో జరుగుతున్న సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అహోబిలం పరిసర ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రయాణిస్తున్న వాహనంపై వైకాపా మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటన అనంతరం ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు పోలీసు బలగాలను భారీగా మోహరించారు.

జమ్మదిన్నెలో రిగ్గింగ్ ఆరోపణలు.. కారంపొడి చల్లుకుని ఘర్షణ:

మరోవైపు ఆళ్లగడ్డ మండలం జమ్మదిన్నె గ్రామంలోనూ పోలింగ్ సమయంలో(AP Panchayat Election) తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వైకాపా మద్దతుదారులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ తెదేపా వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరి ఘర్షణకు దారితీసింది. పోలింగ్ కేంద్రం వద్దే ఇరువర్గాలు కారంపొడి చల్లుకుని పరస్పరం దాడులకు పాల్పడటం స్థానికంగా ఆందోళన కలిగించింది.

తాత్కాలికంగా నిలిచిన పోలింగ్.. భద్రత కట్టుదిట్టం:

జమ్మదిన్నె పోలింగ్ కేంద్రం వద్ద కారంపొడి దాడి, ఘర్షణల నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ పోలింగ్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నంద్యాల జిల్లాలోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు నిరంతర నిఘా ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article