కాంగ్రెస్‌కు జగన్ వెన్నుపోటు.. సీఎం సీటు కోసం డిమాండ్.. ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్!

Must read

Vijayasai Reddy: కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని, అసలు వెన్నుపోటుదారు ఎవరో వైసీపీ నేతలు గ్రహించాలని పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్‌పీ) అధ్యక్షుడు విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. డిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, వైఎస్సార్ మరణానంతరం ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ డిమాండ్ చేశారని, ఆ అభ్యర్థనను సోనియాగాంధీ నిరాకరించడంతోనే కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. వైసీపీని నిలబెట్టేందుకు తాను పడిన కష్టం, జగన్ వెంట జైలుకు వెళ్లడం వల్లే పార్టీలో నంబర్-2 స్థానం దక్కిందే తప్ప, అది ఎవరూ ఉచితంగా ఇచ్చింది కాదని స్పష్టం చేశారు. అయితే, ఆ తర్వాత పార్టీ వ్యవహారాలకు సంబంధించి సజ్జలకు రిపోర్ట్ చేయాలని చెప్పడం, బీజేపీ-వైసీపీ మధ్య అనుసంధానకర్తగా తనను తప్పించడం వంటి పరిణామాలతో తీవ్ర అవమానాలకు గురై పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు.

జగన్ చుట్టూ కోటరీ.. కుటుంబ వ్యవహారాలపై స్పష్టత:

తనకు జరిగిన అవమానాల వెనుక జగన్ ఆమోదం, అవగాహన ఉన్నాయని విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)ఆరోపించారు. జగన్ చుట్టూ ఒక కోటరీ ఏర్పడిందని, బయటి విషయాలు ఆయనకు తెలియకుండా ఆ కోటరీ అడ్డుకుంటోందని విమర్శించారు. వైఎస్ కుటుంబ వ్యవహారాల గురించి తనకు, కేవీపీకి పూర్తిగా తెలుసని, కానీ అన్ని విషయాలను బహిర్గతం చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకాల అంశం వారిద్దరి వ్యక్తిగత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు.

పీఆర్‌పీ విధానాలు, ఉగాది తర్వాత పాదయాత్ర:

1983లో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాలనే తన పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్‌పీ) కూడా అనుసరిస్తుందని విజయసాయిరెడ్డి తెలిపారు. సమాజంలోని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తమ పార్టీ నిరంతరం పాటుపడుతుందని, రానున్న ఉగాది పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని ఆయన ప్రకటించారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article