బ్యాట్ పట్టుకుంటే బాదుడే.. వైభవ్ 204 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ వీడియో చూశారా?

Must read

  • 53 బంతుల్లో 204 పరుగులు..
  • 28 సిక్సర్లతో వైభవ్ విధ్వంసం
  • బౌలర్లకు చుక్కలు చూపించిన బుడతడు

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతోంది. బ్యాట్ పట్టుకుంటే చాలు.. బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. క్రీజులోకి వచ్చాడంటే సిక్సర్ల మోత మోగాల్సిందే అన్నట్టుగా ఆడుతున్నాడు ఈ యువ సంచలనం.

తాజాగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సృష్టించిన విధ్వంసం చూస్తే ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. సిక్సర్లతో సునామీ సృష్టించిన బుడతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

250 టార్గెట్ ఉఫ్ ఊదేశాడు :
ఈ మ్యాచ్‌లో భారత్-ఎ ముందు యూఏఈ 250 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి భారత బ్యాటర్లు ఎక్కువ సమయం తీసుకోలేదు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు బాదేశాడు. ఇందులో ఏకంగా 28 సిక్సర్లు, బౌండరీల రూపంలో పరుగుల వరద పారించాడు.

మైదానంలో ఏ వైపు బంతి వేసినా బౌండరీ దాటించడమే పనిగా పెట్టుకున్నాడు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఒక్కో బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తూ ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించాడు.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు బాదడం సరికొత్త రికార్డుగా నిలిచింది..

7 వికెట్ల తేడాతో భారత్ విజయం :
వైభవ్ దూకుడుతో భారత్-ఎ కేవలం 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఒకవైపు జట్టు గెలుపు.. మరోవైపు వ్యక్తిగత రికార్డు.. ఇలా ఈ మ్యాచ్ వైభవ్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారింది..

వైభవ్ ఊచకోత వీడియో :
చిన్న వయసులోనే ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ ఆటతీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అతను బాదిన 28 సిక్సర్ల వీడియో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అసలు ఏ బౌలర్‌ను కూడా వదలకుండా వైభవ్ ఎలా చెలరేగిపోయాడో ఈ వీడియోలో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఒక్కసారి ఈ సిక్సర్ల విధ్వంసాన్ని మీరు ఓసారి చూడాల్సిందే..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article