అప్పుడే స్కూల్ లో జాయిన్ అయిన క్లిన్ కారా పాప.. దగ్గరుండి చేర్పించిన రామ్ చరణ్, ఉపాసన..

Must read

Klin Kaara : మెగా మనవరాలు క్లిన్ కారా స్కూల్ లో జాయిన్ అయిందని సమాచారం. 2011లో పెళ్లి చేసుకున్నరామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న క్లిన్ కారా జన్మించిన సంగతి తెలిసిందే. చరణ్ కి కూతురు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసారు. రెండేళ్ల వరకు క్లిన్ కారా ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు మెగా ఫ్యామిలీ అంతా. ఈ సంవత్సరం జూన్ లో చరణ్, ఉపాసన కలిసి క్లిన్ కారాని రివీల్ చేసారు.

క్లిన్ కారా తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో రామ్ చరణ్- ఉపాసనలకు కవలలు కూడా జన్మించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా క్లిన్ కారాని స్కూల్ లో జాయిన్ చేసారని సమాచారం. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. క్లిన్ కారాకు మూడేళ్లు దాటడంతో ఓ స్కూల్ లో నేడు కార్తీక పౌర్ణమి మంచి రోజు అని జాయిన్ చేసినట్టు తెలుస్తుంది.

Also See : Nayani Pavani : లక్ష ద్వీప్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ భామ. బికినీలో బోల్డ్ ఫోజులతో వైరల్..

రామ్ చరణ్, ఉపాసన దగ్గరుండి మరీ ఇద్దరూ కలిసి వెళ్లి క్లిన్ కారాని స్కూల్ లో జాయిన్ చేసారు. ఈ ఇద్దరూ స్కూల్ కి వెళ్ళింది, చరణ్ క్లిన్ కారాని ఎత్తుకున్నది, క్లిన్ కారా కిందకి దిగి ఉపాసన దగ్గరికి వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆల్రెడీ క్లిన్ కారాకు గత దసరాకు అక్షరాభ్యాసం చేయించారని, నేడు మంచి రోజు కాట్టి స్కూల్ లో జాయిన్ చేసారని సమాచారం.

క్లిన్ కారాను వచ్చే సంవత్సరం కొత్త అకడమిక్ ఇయర్ నుంచి అధికారికంగా స్కూల్ కి పంపిస్తారని తెలుస్తుంది. దీంతో క్లిన్ కారా ని స్కూల్ లో జాయిన్ చేసిన వీడియో వైరల్ అవ్వగా మెగా ఫ్యాన్స్ అప్పుడే క్లిన్ కారా పాప స్కూల్ కి వెళిపోతుందా అని ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article