వావ్.. బుడ్డోడి దండయాత్ర.. వైభవ్ దెబ్బకు యూఏఈ విలవిల.. సెమీస్‌కు టీమిండియా!

Must read

  • 53 బంతుల్లో 204 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
  • 16 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 28 బంతుల్లో సెంచరీ
  • సిక్సర్ల సునామీతో యూఏఈ బౌలర్లకు చుక్కలు
  • 14.2 ఓవర్లలోనే ఇండియా ఏ సంచలన విజయం

India A vs UAE : క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని ఇన్నింగ్స్ చూస్తే నమ్మడం కూడా కష్టమే అనిపిస్తుంది. బౌలర్లు ఎంత ప్రయత్నించినా బ్యాటర్‌ను ఆపలేని పరిస్థితి ఎదురవుతుంది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఇలాంటి విధ్వంసమే సృష్టించాడు.

యూఏఈ ఏతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌తో ఇండియా A జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నీలో ఇండియా ఎ సెమీస్‌కు చేరింది. మరోవైపు.. గ్రూప్‌ బి నుంచి పాకిస్తాన్‌ ఎ సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా గ్రూప్‌ ఎ నుంచి బంగ్లాదేశ్‌ శ్రీలంక ఎ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి.

మొదట బ్యాటింగ్‌లో అదరగొట్టిన యూఏఈ :

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ ఏ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆర్యాంశ్ శర్మ తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. మరోవైపు భారత బౌలర్ అర్షద్ ఖాన్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.

Read Also : Vaibhav Suryavanshi : 28 సిక్సర్లు.. 204 పరుగులు.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ.. వైభవ్ విధ్వంసానికి రికార్డులన్నీ ఫిదా!

కానీ, హర్ప్రీత్ సింగ్ భాటియా మాత్రం అద్భుతంగా ఆడాడు. 144 బంతుల్లో 130 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. దీంతో యూఏఈ 50 ఓవర్లలో 8 వికెట్లకు 249 పరుగులు చేసింది. అర్షద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు. యూఏఈ ఏ జట్టు ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

వైభవ్ సిక్సర్ల సునామీ.. రికార్డుల మోత :
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏకు ఆరంభంలోనే 2 వికెట్లు పడినా వైభవ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలించాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరో 12 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.

ఇక్కడితో ఆగకుండా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చివరకు 52 బంతుల్లో డబుల్ సెంచరీ మార్కును చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. మొత్తం 53 బంతుల్లో 204 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు, 7 ఫోర్లు ఉండటం విశేషం..

సెమీస్ రేసులో ఇండియా Aకు బూస్ట్ :
వైభవ్ విధ్వంసంతో ఇండియా-ఎ కేవలం 14.2 ఓవర్లలోనే 250 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏ చేతిలో ఓడిన జట్టుకు ఈ గెలుపు భారీ ఊరటనిచ్చింది. 3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో సెమీఫైనల్ ఆశలను మరింత పెంచుకుంది. ఒక్క ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టోర్నీలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article