Hey Kannamma Trailer : ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ యశ్వంత్ హీరోగా మారి తెరకెక్కుతున్న సినిమా హే కన్నమ్మ. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదాలు పడి ఇప్పుడు నవంబర్ 27 రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, మోడల్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా కార్తీక మురళీధరన్ నటిస్తుంది. ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాణంలో శశికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
తాజాగా హే కన్నమ్మ ట్రైలర్ రిలీజ్ చేరేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే హీరోకి చిన్నప్పట్నుంచి డ్యాన్స్ ఇష్టం ఉన్నా ఇంట్లో వాళ్ళు వద్దనడంతో రెగ్యులర్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయితో లవ్ లో ఉండగా డ్యాన్స్ క్లాస్ లో మరో అమ్మాయిని ఇష్టపడతాడు. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా సాగింది? తనకు ఇష్టమైన డ్యాన్సర్ గా మారాడా అనేది హే కన్నమ్మ కథ అని తెలుస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో యశ్వంత్ మాస్టర్ – ధనశ్రీ వర్మ మధ్య బోల్డ్ సీన్స్ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.
Also See : Swathi Karimireddy : మేఘాలయ వాటర్ ఫాల్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నటి స్వాతి రెడ్డి..
మీరు కూడా హే కన్నమ్మ ట్రైలర్ చూసేయండి..



