Bandla Ganesh : ఇటీవల బండ్ల గణేష్ జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఇవ్వాల్సిన డబ్బులను 95 లక్షల చెక్ ఇవ్వగా అది బౌన్స్ అయిందని వెంకటేశ్వర్లు కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని, బండ్ల గణేష్ ని అరెస్ట్ చేయాలని తీర్పు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై బండ్ల గణేష్ న్యాయం కోసం పై కోర్టుకు వెళ్తాను అన్నారు.
ఈ కేసు విషయంలో బండ్ల గణేష్ పై పలు తప్పుడు వార్తలు ప్రచారం చేసారని రూమర్లు వచ్చాయి. దీనిపై జెట్టి వెంకటేశ్వర్లు స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
Also See : Mohan Babu : 51 ఏళ్ళ నట ప్రస్థానం.. మోహన్ బాబు స్పెషల్ సెలబ్రేషన్స్..
జెట్టి వెంకటేశ్వర్లు మాటాడుతూ.. మాది ప్రకాశం జిల్లా. మాకు బండ్ల గణేష్ కి మధ్య పది పదిహేనేళ్లుగా మంచి అనుబంధం కొనసాగుతుంది. ఆయన చిన్న స్థాయి నుంచి కష్టపడి ఎదిగొచ్చిన వాళ్ళు. అతను, మా అబ్బాయి మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. మా అబ్బాయి మరణించాక నాకు, బండ్ల గణేష్ కి మధ్య ఈగోల వల్ల, కొంతమంది మధ్యవర్తిల వల్ల కొన్ని తేడాలు వచ్చాయి అంతే. అవి కోర్టు కేసులు అయ్యాయి. నవంబర్ 18న జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఆ తర్వాత కొంతమంది మీడియా వాళ్లు ఏవేవో వార్తలు రాసారు. ఇప్పుడు మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. అన్ని పరిష్కారం అయ్యాయి. ఇప్పుడు మేము ఇద్దరం ఫ్రెండ్లిగా బాగానే ఉన్నాము. నేను, గణేష్ గారు బాగానే ఉన్నాము ఎలాంటి సమస్యలు లేవు అని తెలిపారు.
తమ మధ్య విభేదాలు ఏమీ లేవు, బండ్ల గణేష్ గారితో తనకున్న స్నేహం, ఆప్యాయత, అనుబంధం మునుపటిలాగే కొనసాగుతాయని స్పష్టం చేసిన జెట్టి వెంకటేశ్వరరావు.
@ganeshbandla #BandlaGanesh https://t.co/8eCZxq0zZT
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 24, 2026




