Trisha : పాలిటిక్స్‌లోకి హీరోయిన్ త్రిష ఎంట్రీ? జయలలిత వారసురాలిగా?

Date:

Trisha : తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే సాధించిన విజయం ఇప్పుడు చిత్ర పరిశ్రమలోని పలువురిని ఆలోచనలో పడేసింది. దీంతో ఎవరికి వారు రాజకీయాల్లోకి వచ్చి అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాట సినిమాలతో తాము సంపాదించుకున్న ఫ్యాన్స్ అండతో వారు రాజకీయాలవైపు అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ విజయ్ తో కలిసి ప్రయాణిస్తున్న హీరోయిన్ త్రిషాకృష్ణన్ ఇప్పుడు విడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడులో త్రిష పేరుతో కొత్తగా ఓ అభిమాన సంఘం ఏర్పాటైంది. దీని పేరు ఇళయ పురట్చితలైవి. అంటే యువ విప్లవనాయకి అని అర్ధం. త్రిష పేరవై అనే టైటిల్ తో దీన్ని ఈ నెల 24న తిరునల్వేలిలో ప్రారంభించబోతున్నారు. సీఎం విజయ్ తో త్రిష సన్నిహితంగా మెలుగుతుండటం వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో కొత్త అభిమాన సంఘం ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు త్రిష ప్లాన్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం విజయ్..అధికారిక..ప్రైవేట్ కార్యక్రమాల్లో తరచూ త్రిష కన్పిస్తూనే ఉంది. అవి పెళ్లిళ్లైనా మరో కార్యక్రమమమైనా సరే ఎక్కడా తగ్గిందే లేదు. అవసరం లేకపోయినా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారే తప్పితే దాపరికమేం లేదు. మరి ఈ అభిమానసంఘం ఏర్పాటు కూడా విజయ్‌కి తెలిసే ఉంటుందంటున్నారు.

Rashi Singh : మిల మిలా మెరిసిపోతున్న రాశిసింగ్.. ఫోటోలు వైర‌ల్..

మాజీ సీఎం జయలలితను పురట్చితలైవిగా సంబోధించేవారు. ఆమె మృతి తర్వాత ఆ పేరును ఇప్పటివరకూ ఎవరూ వాడలేదు. ఇప్పుడు త్రిష అదే పేరుతో అభిమాన సంఘం ప్రారంభించబోతుండటం చూస్తే జయలలిత వారసురాలిగా తమిళనాడు రాజకీయాల్లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకును ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు.

గతంలో త్యాగ సుడర్ త్రిష పేరవై పేరుతో మరో అభిమాన సంఘానికి సంబంధించి కూడా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్న అభిమాన సంఘం వెనుక త్రిష ఉందా లేదా అనే మరో చర్చ కూడా జరుగుతోంది. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్ టీవీకేలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు త్రిష ఈ హంగామా మొదలుపెట్టారా అనే మరో చర్చ కూడా జరుగుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.399కే అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా!

జియో యూజర్లకు పండగే.. రూ.399కే అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా జియో కొత్త...

HONOR 700 Series : హానర్ 700, 700 ప్రో, 700s వచ్చేశాయ్.. ధర, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

భారీ బ్యాటరీతో హానర్ 700 సిరీస్ లాంచ్ 9,000mAh బ్యాటరీతో హానర్ కొత్త...

NVIDIA Jensen Huang : ఎన్వీడియా CEOగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ..

తిరిగి బాధ్యతలు చేపట్టిన జెన్సన్ హువాంగ్.. చర్చల తర్వాత బోర్డు గ్రీన్...