రష్యాకు ఉక్రెయిన్ భారీ షాక్.. లిబియా తీరంలో యుద్ధనౌకను పేల్చేశాం.. జెలెన్‌స్కీ వీడియో!

Date:

  • సముద్రంలో రష్యా నౌకలకు ముప్పు..
  • ఏడు డ్రోన్లతో జెలెన్‌స్కీ మెరుపు దాడి
  • లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక ఖతం..

Russia Ukraine War : యుద్ధం అంటే కేవలం భూమి మీదే కాదు.. సముద్రంలోనూ సాగుతుందని మరోసారి నిరూపించింది ఉక్రెయిన్.. రష్యాకు చెందిన యుద్ధనౌకను లిబియా తీరంలో ముంచేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. ఈ దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది..

కేఏ-27 యుద్ధ హెలికాప్టర్ ధ్వంసం :
జెలెన్‌స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ తయారు చేసిన 7 నేవీ డ్రోన్లతో రష్యాకు చెందిన 2 నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఒకటి చిన్నపాటి యుద్ధనౌక ‘మెర్క్యురీ’. 2023లో అందుబాటులోకి వచ్చిన ఈ నౌక రష్యా నౌకాదళానికి చెందిన ఆధునిక యుద్ధనౌకల్లో ఒకటిగా చెబుతున్నారు. ఈ దాడిలో కేఏ-27 యుద్ధ హెలికాప్టర్ కూడా ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

Read Also : Jio New Year Recharge Plans : జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.399కే అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా!

ఇక మరోవైపు రష్యాకు చెందిన ‘ఎమ్‌వీ అంగారా’ సరకు రవాణా నౌకను కూడా ఉక్రెయిన్ డ్రోన్లు టార్గెట్ చేసినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఆయుధాల రవాణాకు ఈ నౌకను ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.

బెంగాజీ నౌకాశ్రయం సమీపంలో దాడి :
అసలు ఈ దాడి లిబియాలోని బెంగాజీ నౌకాశ్రయం సమీపంలో జరిగింది.. ఇంధనం, ఇతర అవసరాల కోసం మెర్క్యురీ యుద్ధనౌక అక్కడ ఉన్న సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

జెలెన్‌స్కీ అభినందనలు :
జెలెన్‌స్కీ విడుదల చేసిన వీడియోలో సముద్రంపై దూసుకొచ్చిన డ్రోన్లు నౌకలను ఢీకొట్టడం, ఆ వెంటనే భారీ పేలుళ్లు సంభవించడం, మంటలు ఎగసిపడటం కనిపిస్తున్నాయి. శత్రువులు నష్టాన్ని తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న తమ భద్రతా సంస్థల సిబ్బందిని జెలెన్‌స్కీ ప్రత్యేకంగా అభినందించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

షాకివ్వనున్న శాంసంగ్.. గెలాక్సీ S27 సిరీస్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. కారణం ఇదే!

శాంసంగ్ గెలాక్సీ S27 కొనాలనుకుంటున్నారా? గెలాక్సీ S27 సిరీస్ ధరలు పెరగనున్నాయా? కొత్త...

సీనియర్ నటుడు పొలిటికల్ పార్టీ..? పంది ముఖంతో పోస్టర్స్ వైరల్..

political party : ఇటీవల రాజకీయాల్లోకి పలువురు సినీ నటులు ఎంట్రీ...

ఇంట్లో వాళ్లకే న్యాయం చేయలేనోడు.. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు? జగన్‌పై పల్లా ఫైర్!

తల్లి, చెల్లికే న్యాయం చేయలేదు.. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోలేక టీడీపీపై బురదా?...