- కార్తీక పౌర్ణమి రోజు మిస్ కావద్దు..
- 27 దీపాలతో ఇలా పూజించండి
- అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు పూజ
Karthika Pournami 2026 : కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ఆలయాల్లో దీపాల వెలుగులు, ఇంటి ముందు ప్రమిదల కాంతులు, శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది.. ఇక కార్తీక పౌర్ణమి అంటే ఈ సందడే మరో స్థాయిలో ఉంటుంది.
ముఖ్యంగా ఈ రోజున చేసే దీపారాధనకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి విశేషమైన రోజున 27 నక్షత్రాల పేరుతో దీపారాధన చేస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈ పూజ వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
27 దీపాలు.. 27 నక్షత్రాలకు ప్రతీక :
జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం.. మనకు మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని మొదలుకొని రేవతి వరకు ఒక్కో నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉందని భావిస్తారు. ఈ 27 నక్షత్రాలను స్మరించుకుంటూ 27 ప్రమిదల్లో దీపాలు వెలిగించడం విశేషమైన ఆచారంగా చెబుతారు. ఒక్కో దీపం ఒక్కో నక్షత్రానికి ప్రతీకగా భావించి భక్తితో పూజిస్తారు..
Read Also : Bisleri Water Scare : బాటిల్ వాటర్ తాగుతున్నారా? తాగే నీళ్లలో ప్రమాదకర రసాయనాలు.. క్యాన్సర్ ముప్పు ఉందా?
ఈ దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని, కుటుంబ సభ్యులకు మంచి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. అలాగే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి, మనసుకు ప్రశాంతత లభించాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తారు.
27 నక్షత్ర దీపారాధన ఎలా చేయాలి? :
కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో లేదా తులసి కోట దగ్గర శుభ్రమైన ప్రదేశంలో 27 మట్టి ప్రమిదలను పెట్టుకోవాలి. అందులో నువ్వుల నూనె లేదా నెయ్యి వేసి వత్తులు పెట్టాలి. అనంతరం ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఒక్కో దీపాన్ని వెలిగించాలి. శివనామస్మరణ చేస్తూ కుటుంబమంతా కలిసి పూజ చేసుకోవచ్చు..
ముఖ్యంగా ఇన్ని దీపాలు వెలిగించడం కుదరని వాళ్లు తమకు వీలైనన్ని దీపాలతో కూడా భక్తిగా పూజ చేసుకోవచ్చు. సంఖ్య కన్నా భక్తి, శ్రద్ధ ముఖ్యమని గుర్తుంచుకోవాలి. దీపాలను సురక్షితమైన ప్రదేశంలో ఉంచి, పిల్లలకు అందకుండా చూసుకోవాలి..
కార్తీక పౌర్ణమి రోజున 27 నక్షత్ర దీపారాధన అనేది మన సంప్రదాయంలో ఆధ్యాత్మికతను, భక్తిని చాటే ఆచారంగా చెబుతారు. ఈ పౌర్ణమి వేళ మీ ఇంట్లోనూ దీపాల వెలుగులు నింపి ఆ పరమశివుడి అనుగ్రహాన్ని పొందవచ్చు.

