- పంచాయతీల్లో ఏకగ్రీవాలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
- భారీ నజరానాలు ప్రకటించిన ప్రభుత్వం
- ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు బహుమతి
ఇదే సమయంలో రాబోయే పంచాయతీ ఎన్నికలపై కూడా నేతలకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఏకగ్రీవాల వల్ల గ్రామాల్లో అనవసరమైన పోటీలు, విభేదాలు తగ్గి అభివృద్ధిపై అందరూ దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని వివరించారు. అందుకే గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు.
జనాభా ఆధారంగా నిధులు :
ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహక నిధుల వివరాలను కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న వాటికి రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందించే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
నేతలకు దిశానిర్దేశం.. :
గతంలో రూ.5 లక్షలుగా ఉన్న కనీస ప్రోత్సాహకాన్ని రూ.15 లక్షలకు, గరిష్ఠ మొత్తాన్ని రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు పార్టీలో వ్యక్తిగత పంతాలు, ఈగోలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. గ్రామస్థాయిలో ఐక్యత పెంచుతూ అభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు..

