Homeతెలంగాణహైదరాబాద్‌ టు కరీంనగర్‌.. గంటల్లోనే ప్రయాణం! కొత్త హైస్పీడ్ రైలు రూట్ ఇదే..?

హైదరాబాద్‌ టు కరీంనగర్‌.. గంటల్లోనే ప్రయాణం! కొత్త హైస్పీడ్ రైలు రూట్ ఇదే..?

  • ఉత్తర తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌..
  • హైదరాబాద్‌ టు కరీంనగర్‌.. ఇక జర్నీ ఈజీ కానుందా?
  • హైదరాబాద్‌ నుంచి స్పెషల్ రైలు వస్తుందా?
  • కరీంనగర్‌కు హైస్పీడ్ రైలు ప్రతిపాదన

రైలు మార్గంలో వెళ్లాలనుకున్నా ప్రస్తుతం అందుబాటులో ఉన్న డెమూ సర్వీసు చుట్టూ తిరిగే మార్గంలో ప్రయాణిస్తోంది. దీంతో సుమారు 309 కిలోమీటర్లు ప్రయాణించడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతోంది. ఇది ప్రయాణికులకు పెద్ద ఇబ్బందిగా మారింది..

కొత్త రూట్‌తో ప్రయాణ సమయం తగ్గే ఛాన్స్ :
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌–ఘట్‌కేసర్‌–పెద్దపల్లి–కరీంనగర్‌ మార్గంలో నమో భారత్‌ ర్యాపిడ్‌ రైలు లేదా మెము సర్వీసు నడపాలని ప్రయాణికుల సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి నుంచి కాజీపేట వరకు మూడో లైన్‌, కాజీపేట నుంచి ఘట్‌కేసర్‌ వరకు రెండో లైన్‌, అక్కడి నుంచి సికింద్రాబాద్‌ వరకు నాలుగో లైన్‌ అందుబాటులో ఉన్నాయి.

ప్రతిపాదిత రూట్‌లో రైలు నడిస్తే 3 నుంచి 4 గంటల్లో కరీంనగర్‌ చేరుకోవచ్చని అంచనా. ఘట్‌కేసర్‌, చర్లపల్లి, మౌలాలి, ఉప్పల్‌ పరిసరాల్లో ఉండేవారికి కూడా ఈ సర్వీసు అత్యంత ప్రయోజనకరంగా ఉండనుంది.

అయితే, ప్రస్తుతం ప్రయాణికుల డిమాండ్‌, ప్రతిపాదన దశలోనే ఉంది. రైల్వే శాఖ దీనిపై పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ రైలు నిజంగా పట్టాలెక్కితే ఉత్తర తెలంగాణ ప్రజలకు ప్రయాణ భారం తగ్గినట్టే..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments