Homeటెక్నాలజీఐఫోన్‌కు పోటీగా వివో 3 కొత్త ఫోన్లు.. వివో X500 సిరీస్ ధరలు లీక్.. బేస్...

ఐఫోన్‌కు పోటీగా వివో 3 కొత్త ఫోన్లు.. వివో X500 సిరీస్ ధరలు లీక్.. బేస్ మోడల్‌కే రూ.1.19 లక్షలా?

  • వివో నుంచి మూడు ప్రీమియం ఫోన్లు..
  • వివో X500 ప్రో మ్యాక్స్ ధర రూ.1.59 లక్షలు
  • కెమెరా, డిస్‌ప్లే అదుర్స్..
  • త్వరలో భారత్‌లోకి వివో X500 సిరీస్ ఎంట్రీ

భారత్ మార్కెట్లోనే లాంచ్.. :
నవంబర్ 26న ఈ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.. వివో ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. :
వివో X500లో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 9600M ప్రాసెసర్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లలో మరింత భారీ డిస్‌ప్లేలు, డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్ ఉండనున్నాయి. మొత్తానికి ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లు భారత మార్కెట్‌లో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments