Homeటెక్నాలజీసూపర్ ఫోన్ బ్రో.. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో మోటోరోలా కొత్త ప్లాన్.. రేజర్ ఫ్లెక్స్ 2027...

సూపర్ ఫోన్ బ్రో.. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో మోటోరోలా కొత్త ప్లాన్.. రేజర్ ఫ్లెక్స్ 2027 ఫీచర్లు లీక్!

  • మోటోరోలా రేజర్ ఫ్లెక్స్ 2027 వచ్చేస్తోంది
  • 12GB ర్యామ్, 5000mAh బ్యాటరీ..
  • అదిరిపోయే ఫీచర్లతో మోటోరోలా కొత్త ఫోల్డబుల్
  • శాంసంగ్‌కు గట్టి పోటీ ఇవ్వనున్న మోటోరోలా

డిస్‌ప్లే, కెమెరాల్లో అదిరిపోయే ఫీచర్లు :
ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో 6.92 అంగుళాల OLED ఇన్నర్ డిస్‌ప్లే ఉండవచ్చని అంచనా. దీనికి 165Hz రిఫ్రెష్ రేట్ ఉండటం మరో ప్రత్యేకత. బయటవైపు 4.97 అంగుళాల కవర్ స్క్రీన్ కూడా అందించవచ్చని తెలుస్తోంది. కెమెరాల విషయానికి వస్తే 50MP ప్రైమరీ కెమెరాతో పాటు మరో 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉండవచ్చట. ప్రైమరీ కెమెరాలో 30X డిజిటల్ జూమ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ విషయంలోనూ తగ్గేదేలే :
ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ, Qi2 వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని లీకులు చెబుతున్నాయి. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉండొచ్చు. పాంటోన్ డార్క్ బొటానికల్ గార్డెన్, కొరియాండర్ కలర్ ఆప్షన్లు ఆకట్టుకోనున్నాయి.

అయితే ఈ వివరాలన్నీ ప్రస్తుతానికి లీకుల ఆధారంగానే వెలుగులోకి వచ్చాయి. మోటోరోలా అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. మార్కెట్‌లోకి వస్తే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, షియోమి ఫోల్డ్ సిరీస్‌కు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ధర, లాంచ్ తేదీపై మాత్రం మరింత స్పష్టత రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments