- ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్
- పీఎఫ్ ఖాతాదారులకు పండగే..
- కొత్త విత్‌డ్రా రూల్స్‌తో భారీ ఊరట
ఉద్యోగం మానేసిన 2 నెలలకే ఫుల్ సెటిల్మెంట్ :
నిరుద్యోగులైన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం ఊరటనివ్వనుంది. గతంలో ఉద్యోగం మానేసిన తర్వాత పూర్తి పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి 12 నెలలు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ గడువును మళ్లీ 2 నెలలకు తగ్గించారు. అంటే.. ఉద్యోగం మానేసి వరుసగా 2 నెలలు నిరుద్యోగిగా ఉన్న తర్వాత నిబంధనల ప్రకారం పూర్తి పీఎఫ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు..
రిటైర్మెంట్ తర్వాత నెలనెలా డబ్బులు :
ఇక రిటైర్మెంట్ చేసినవారికి కూడా ఈపీఎఫ్ఓ మరో మంచి అవకాశం కల్పించనుంది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ద్వారా పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోకుండా నెలవారీ, 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి వాయిదాల రూపంలో తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంపై వర్తించే పీఎఫ్ వడ్డీ కొనసాగుతుంది..
అయితే, ఈ మార్పులకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్, అమలు మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈపీఎస్ కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అంశంపై మాత్రం ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. మొత్తంగా ఈ కొత్త నిర్ణయాలు పీఎఫ్ ఖాతాదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నాయి.

